టీ తాగుతుండగా వచ్చి..
ABN , First Publish Date - 2020-12-13T05:48:41+05:30 IST
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్, వ్యాపారి పోలిశెట్టి సత్యనారాయణ అలియాస్ టెక్కె సత్యంపై శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 12: నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్, వ్యాపారి పోలిశెట్టి సత్యనారాయణ అలియాస్ టెక్కె సత్యంపై శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఓ హోటల్ యజమానికి, పోలిశెట్టి సత్యనారాయణ మధ్య కరెంటు బిల్లుకు సంబంధించిన వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అయితే సాయంత్రం అదే హోటల్ వద్దకు వచ్చి సత్యనారాయణ టీ తాగుతుండగా ఆటోలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సత్యనారాయణపై దాడి చేశారు. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు చేసేందుకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.