-
-
Home » Andhra Pradesh » Kurnool » Former Suporting at Candils
-
కొవ్వొత్తులతో రైతులకు మద్దతు
ABN , First Publish Date - 2020-12-16T05:23:54+05:30 IST
మండలంలోని శకునాల గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు.

ఓర్వకల్లు, డిసెంబరు 15: మండలంలోని శకునాల గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగన్న, రైతు సంఘం మండల అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, చాంద్‌బాషా మాట్లాడుతూ ఢిల్లీలో 18 రోజులుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. ఈ కార్య క్రమంలో ఇస్మాయిల్, మల్లమ్మ, రమాదేవి, షరీఫ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమి టీ నాయకులు ఏసురత్నం, బైరాపురం రహీం, అష్ర్‌ఫఅలి, బషీర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నంద్యాల టర్నింగ్‌లో రైతులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆయా సంఘాల నాయకులు రామ్‌నాయక్, సు రేంద్ర, గణపతి, భాస్కర్, అంబయ్య, రమణ, శివుడు, రవి ఉన్నారు.