గుండెపోటుతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-11-07T05:14:15+05:30 IST

మండలంలోని ముత్తలూరు గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి (60) అనే రైతు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డకు తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందాడు.

గుండెపోటుతో రైతు మృతి

రుద్రవరం, నవంబరు 6: మండలంలోని ముత్తలూరు గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి (60) అనే రైతు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డకు తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందాడు.  మృతుడికి భార్య వెంకటనారాయణమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు.  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ముత్తలూరు గ్రామానికి చేరుకొని మృతి చెందిన రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


Updated Date - 2020-11-07T05:14:15+05:30 IST