ఐదేళ్ల తర్వాత సమీక్ష
ABN , First Publish Date - 2020-12-30T05:38:31+05:30 IST
జిల్లాలో హెల్త్ ఎడ్యుకేటర్ల సమీక్ష సమావేశం ఐదేళ్ల తర్వాత మంగళవారం నిర్వహించారు.
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 29: జిల్లాలో హెల్త్ ఎడ్యుకేటర్ల సమీక్ష సమావేశం ఐదేళ్ల తర్వాత మంగళవారం నిర్వహించారు. 2015లో అప్పటి డీఎంహెచ్‌వో డా.నరసింహులు హయాంలో జిల్లా మాస్ మీడియా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. జిల్లాలో హెల్త్ ఎడ్యుకేటర్లు 21 మంది ఉన్నారు. వీరంతా వారికి కేటాయించిన ప్రాంతాల్లో జాతీయ ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలి. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ ఐదేళ్లలో కృష్ణ, తుంగభద్ర పుష్కరాలు, వరదలు, కరోనా వైర్‌స వంటి సమస్యలు వచ్చిన సమయంలో కూడా హెల్త్ ఎడ్యుకేటర్ల సమావేశం గురించి అధికారులు పట్టించుకోలేదు. గతంలో ప్రతి నెల 28న హెల్త్ ఎడ్యుకేటర్ల సమీక్ష సమావేశం నిర్వహించేవారు.