అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు

ABN , First Publish Date - 2020-07-20T11:29:50+05:30 IST

కరోనా వైరస్‌తో జనం అల్లాడిపోతుంటే కొంతమంది ఎరువుల దుకాణాల యజమానులు మాత్రం రైతులను నిలువునా

అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు

 లైసెన్స్‌ రద్దుచేస్తాం: ఏడీఏ జమ్మన్న 


ఎమ్మిగనూరు/ అగ్రికల్చర్‌ జూలై 19: కరోనా వైరస్‌తో జనం అల్లాడిపోతుంటే కొంతమంది ఎరువుల దుకాణాల యజమానులు మాత్రం రైతులను నిలువునా ముంచుతున్నారు. ధరలు పెంచి ఎరువులను అమ్ముతున్నట్లు తనిఖీల్లో వెలుగుచూసింది. ఆదివారం ఏడీఏ జమ్మన్న ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. వాల్మీకి సర్కిల్‌లో దాదాపు 20దుకాణాలను తనిఖీ చేశారు. అయితే రాఘ వేంద్ర ట్రేడర్స్‌ దుకాణం వద్ద ఓ రైతుకు ఎస్టిమేట్‌ ఇచ్చినట్లు గుర్తించి ఏడీఏ అగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరో దుకాణం వద్ద కూడా ఇలాగా చేస్తున్నట్లు దుకాణాలపై విచారణ చేసి, చర్యలు తీసు కుంటా మని తెలిపారు. యురియా బస్తా రూ.266 కాగా బహిరంగ మార్కెట్‌ లో రూ.320 నుంచి రూ. 340వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 


విచారించి లైసెన్స్‌ రద్దు చేస్తాం

దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశాం. రెండు దుకాణాల్లో రైతులకు రశీదు ఇవ్వకుండా ఎస్టిమెంట్‌ బిల్లులు ఇచ్చారు. విచారణ జరిపి   లైసెన్స్‌ రద్దుచేస్తాం.         

జమ్మన్న, ఏడీఏ, ఎమ్మిగనూరు 

Updated Date - 2020-07-20T11:29:50+05:30 IST