సాగుకు పనికి రాకుండా చేశారు
ABN , First Publish Date - 2020-11-13T05:57:07+05:30 IST
తమ పొలాల్లో జిందాల్ పరిశ్రమ సిబ్బంది గుంతలు తవ్వి సాగుకు పనికి రాకుండా చేశారని బిలకలగూడురు గ్రామానికి చెందిన రైతులు పుల్లన్న, సామెల్ ఆవేదన వ్యక్తం చేశారు.
- పొలాల్లో గుంతలు తవ్వారని రైతుల ఆవేదన
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు
గడివేముల, నవంబరు 12: తమ పొలాల్లో జిందాల్ పరిశ్రమ సిబ్బంది గుంతలు తవ్వి సాగుకు పనికి రాకుండా చేశారని బిలకలగూడురు గ్రామానికి చెందిన రైతులు పుల్లన్న, సామెల్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో రిలే నిరాహారదీక్ష చేశారు. ఈ సందర్భంగా పుల్లన్న మాట్లాడుతూ 1971 సంవత్సరంలో ప్రభుత్వం జీవనోపాధి కోసం 248 సర్వే నంబర్‌లో 5 ఎకరాలు ఇచ్చిందని పుల్లన్న తెలిపారు. ఈ 5 ఎకరాల్లో రెండు ఎకరాల పొలం జిందాల్ యాజమాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసిందని అన్నారు. మిగిలిన భూమిలో గుంతలు తవ్వి మట్టి పోశారని అన్నారు. దీంతో సాగు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరాడు.