ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి

ABN , First Publish Date - 2020-11-22T05:28:09+05:30 IST

ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి

కోడుమూరు (రూరల్‌), నవంబరు 21: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండ లంలోని వర్కూరు గ్రామానికి చెందిన వెంకటప్ప తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, వరి సాగు చేశాడు. అయితే అధిక వర్షాలతో ఉల్లి, మిరప పంటలు నష్టపోయాడు. దీనికి తోడు గత కొన్నేళ్లుగా పంటల సాగులో నష్టాలు రావడంతో దాదాపు రూ.5 లక్షలు అప్పు మిగి లింది. 19వ తేది రాత్రి బహిర్భూమికి అని వెళ్లి పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. అయితే కాసేపటికి బాధ తాళలేక విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో అతడిని భార్య లక్ష్మీదేవి బంధువుల సాయంతో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకటప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. 

Read more