అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-13T09:10:45+05:30 IST

మండల పరిధిలోని గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన ఉమ్మడి దస్తగిరి రెడ్డి (48) అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల నుం

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అవుకు, సెప్టెంబరు 12: మండల పరిధిలోని గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన ఉమ్మడి దస్తగిరి రెడ్డి (48) అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల నుంచి వరుసగా పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు రూ.15 లక్షల వరకూ అయ్యాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచక శనివారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


కుటుంబీకులు చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రైతు దస్తగిరి రెడ్డికి భార్య అన్నపూర్ణ, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-13T09:10:45+05:30 IST