రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-12T09:51:23+05:30 IST
మండలంలోని మొళగవల్లి గ్రామంలో పాపమ్మ గారి రామాంజనేయులు (40) అనే రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధు

ఆలూరు రూరల్, ఆగస్టు 11: మండలంలోని మొళగవల్లి గ్రామంలో పాపమ్మ గారి రామాంజనేయులు (40) అనే రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల వివరాల మేరకు.. తనకున్న 3 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పప్పుశనగ, వాము సాగు చేశాడు. అయితే దిగుబడి రాలేదు. గత ఏడాది కూడా నష్టాలపాలయ్యాడు.
ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. అప్పులు రూ.9లక్షలు అయ్యాయి. వీటిని తీర్చే మార్గం కనిపించక మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకున్నాడు. రామాంజనేయులకు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.