మహాదుర్గ అలంకారంలో భ్రామరి

ABN , First Publish Date - 2020-03-24T11:11:55+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రం లో జరుగుతున్న ఉగాది మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం భ్రమరాంబదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహాదుర్గ అలంకారంలో భ్రామరి

శ్రీశైలం, మార్చి 23: శ్రీశైల మహాక్షేత్రం లో జరుగుతున్న ఉగాది మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం భ్రమరాంబదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జునుడు కైలాస వాహనంపై అధిష్టించి సేవలందుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రదిక్షణ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా ఉగాది ఉత్సవాలు ఆలయానికే పరిమితమయ్యాయి.


భక్తులు అన్‌లైన్‌ ద్వారా వీక్షించేందుకు వీలుగా ఉగాది మహోత్సవాలు ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌ ద్వారా దేవస్థానం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తోంది. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామరావు, ఆలయ ప్రధాన అర్చకులు పీఠం మల్లికార్జున స్వామి, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మార్కండేయశాస్త్రి, ఉభయ దేవాలయ అర్చకులు, వేదపండితులు, ఏఈవో కృష్ణారెడ్డి, శ్రీశైల ప్రభ సంపాదకులు డాక్టర్‌ సీ.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 


నేడు నందివాహనసేవ..

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మంగ ళవారం స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ, అమ్మవారి ఉత్సవమూర్తికి మహాసరస్వతి అలం కారంలో దర్శనం ఇవ్వనున్నారు.

Read more