నాటుసారా బట్టీలపై దాడులు

ABN , First Publish Date - 2020-12-07T05:17:29+05:30 IST

నల్లమల్ల అటవీ పరిధిలో రుద్రవరం మండలంలోని గోనంపల్లె గ్రామ సమీపంలో తెలుగుగంగ కాలువ దగ్గరలో నాటుసారా బట్టీలపై ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఆదివారం సిబ్బందితో దాడి చేశారు.

నాటుసారా బట్టీలపై దాడులు

రుద్రవరం, డిసెంబరు 6: నల్లమల్ల అటవీ పరిధిలో రుద్రవరం మండలంలోని గోనంపల్లె గ్రామ సమీపంలో తెలుగుగంగ కాలువ దగ్గరలో నాటుసారా బట్టీలపై ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఆదివారం సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో 30 లీటర్ల నాటుసారా సీజ్‌ చేసి 5 డమ్ముల్లో నిల్వ ఉన్న 1,000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశామని ఆయన తెలిపరు. నాటుసారా తయారు చేస్తున్న డమ్ములను, కుండలను, వెదురు గొట్టలను పగలగొట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


ఓర్వకల్లు: మండల కేంద్రమైన ఓర్వకల్లు శికారిపేటలో అక్రమంగా తయారు చేస్తున్న సారాబట్టీలపై కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2వేల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురుపై కేసు నమోదు చేశారు. 

Read more