నాయకులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ABN , First Publish Date - 2020-11-06T05:44:34+05:30 IST

ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు డీలర్‌ నాగన్న, బోయ మల్లయ్యను శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం పరామర్శించారు.

నాయకులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా

ఆత్మకూరురూరల్‌, నవంబరు 5: ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు డీలర్‌ నాగన్న, బోయ మల్లయ్యను శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం పరామర్శించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తమ ఇళ్ల వద్దకే వెళ్లి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఇటీవల మృతిచెందిన ఆదినారాయణ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. నాయకులు శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, షాబుద్దీన్‌, నాగూరు, మల్లికార్జునరెడ్డి, నాగరాజు, తులసీనాయక్‌, వెంకటేశ్వర్లు, భాస్కర్‌, చిన్న, ఫకృద్దీన్‌, అచ్చిరెడ్డి, శేఖరరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-06T05:44:34+05:30 IST