భార్య చనిపోవడంతో..

ABN , First Publish Date - 2020-12-27T06:04:16+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని కూరపాటి వీధిలో నివాసం ఉంటున్న మాజీ సైనిక ఉద్యోగి అయ్యపు పెద్దనారాయణశెట్టి (67) ఆత్మహత్య చేసుకున్నారు.

భార్య చనిపోవడంతో..

చాగలమర్రి, డిసెంబరు 26: చాగలమర్రి గ్రామంలోని కూరపాటి వీధిలో నివాసం ఉంటున్న మాజీ సైనిక ఉద్యోగి అయ్యపు పెద్దనారాయణశెట్టి (67) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణశెట్టి ఆర్మీలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ఎస్‌బీఐలలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహించారు. మూడు నెలల క్రితం ఆయన భార్య కుమా రి మృతి చెందారు. అప్పటి నుంచి నారాయణశెట్టి ఒంటరి జీవితాన్ని భరించలేక బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి ఇంటిలోకి వెళ్లిన నారాయణశెట్టి శనివారం ఉదయం బయటకు రాలేదు. దీంతో చుట్టుపక్కల వారు ఇంటిలోకి చూడగా ఉరి వేసు కుని కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మారుతి తెలిపారు. పెద్దనారాయణశెట్టికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


Updated Date - 2020-12-27T06:04:16+05:30 IST