-
-
Home » Andhra Pradesh » Kurnool » Everyone should cooperate Rdo
-
అందరూ సహకరించాలి: ఆర్డీవో
ABN , First Publish Date - 2020-03-25T10:41:16+05:30 IST
కరోనా నివారణకు అందరూ సహకరించాలని ఆర్డీవో బాలగణేశయ్య, డీఎస్పీ రామకృష్ణ, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో గీతావాణి కోరారు.

ఆదోని రూరల్, మార్చి 24: కరోనా నివారణకు అందరూ సహకరించాలని ఆర్డీవో బాలగణేశయ్య, డీఎస్పీ రామకృష్ణ, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో గీతావాణి కోరారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో వారు చర్చించారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఒకే చోట ఎక్కువ మంది గుమికూడదని, కావున ప్రార్థనలు ఇంట్లోనే ఉండి చేసుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టూటౌన్ సీఐ లక్షుమయ్య ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పోలీస్ వాహనంలో పట్టణం మొత్తం కలియదిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సహకరించాలని నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించారు. అలాగే పట్టణంలోని వన్, టూ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు జరిమానాలు విధించారు.