‘ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయండి’
ABN , First Publish Date - 2020-12-29T04:49:38+05:30 IST
ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు.
ఆదోని(అగ్రికల్చర్), డిసెంబరు 28: ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక భీమాస్ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అతి ప్రచీనమైన 156 ఏళ్లు చరిత్ర కలిగిన ఆదోని మున్సిపాలిటీలో ప్రభుత్వ కళాశాలలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పోరాడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత రెండేళ్ల క్రితం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదలైనప్పటికీ అధికారంలోకి వచ్చిన వైసీపీ కనీసం నోరుమెదపడం లేదని అన్నారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాడుతామని హెచ్చరించారు.