ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు

ABN , First Publish Date - 2020-11-28T04:37:32+05:30 IST

డాక్డర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు

కర్నూలు(అర్బన్‌), నవంబరు 27: డాక్డర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉప కులపతి ప్రొఫెసర్‌ ముజఫర్‌ అలీ నుంచి రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా యోగి వేమన వర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యుడిగా, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా, బీఎఎస్‌ చైర్మన్‌గా కీలక పదవుల్లో  పనిచేసిన ఆయన ఇక్కడికి బదీలీపై వచ్చారు. ఆయన స్థానంలో పని చేసిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమణారెడ్డి 20వ తేదీన బాధ్యతలను ఉపకులపతికి అప్పగించి సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లా కావలిలోని మాతృసంస్థకు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.


Read more