దగా పడుతున్న రైతులు

ABN , First Publish Date - 2020-04-07T10:25:37+05:30 IST

కష్టించి, పంటను పండించిన రైతుకు తీరా దిగుబడి అమ్ముకోవాలంటే మాత్రం నిరాశ ఎదురవుతోంది. నాణ్యత సాకుతో

దగా పడుతున్న  రైతులు

ముంచుతున్న కమీషన్‌ ఏజెంట్లు


ఎమ్మిగనూరు టౌన్‌, ఏప్రిల్‌ 6: కష్టించి, పంటను పండించిన రైతుకు తీరా దిగుబడి అమ్ముకోవాలంటే మాత్రం నిరాశ ఎదురవుతోంది. నాణ్యత సాకుతో కమీషన్‌ ఏజెంట్లు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. రైతుల తక్కువ ధరకు కొని వ్యాపారులకు మాత్రం అధిక ధరలకు అంటగడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకో వాలని రైతులు కోరుతున్నారు.


గిట్టుబాటు కల్పించాలి

మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన మార్కెట్‌కు టమోటా 25 కేజీల బాక్సులు తెచ్చాను. బాక్సు రూ.60 చొప్పున ధర నిర్ణయించారు. ఏజెంటు కమీషన్‌ రూ.60పోగా రూ.540 చేతికొచ్చింది. ఆటోకు రూ.15 0 ఇచ్చాను. కూలీలకు రూ.400లు పోగా రూ.10 నాకు మిగి లింది. నా దగ్గర కొన్న సరుకును ఏజెంట్లు వ్యాపారులకు అధిక ధర విక్రయించ డం గమనించాను. కేజీ రూ.10కి అమ్మి సొమ్ము చేసుకుం టున్నారు.  

- కేశన్న, ఎర్రకోట


నిలువునా మోసం చేస్తున్నారు

మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్లు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.  50 కేజీల బెండకాయలు తెచ్చాను. కమీషన్‌ ఏజెంట్‌ నా సరుకు అమ్మి కమీషన్‌ రూ.100 పట్టుకుని రూ.500 చేతికి చ్చారు. ఇదే సరుకును వ్యాపారులు మాత్రం రూ.40 కేజీ చొప్పున అమ్ము తున్నారు. ఇదేక్కటి న్యాయం. అధికారులు చర్యలు తీసు కోవాలి. 

- చిన్నా,  పెద్దకడుబూరు 

Read more