ఆధునిక సాంకేతికతతో రోగ నిర్ధారణ

ABN , First Publish Date - 2020-03-02T11:21:57+05:30 IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగాలను నిర్ధారించడంలో రేడియాలజీ వైద్యుల పాత్ర కీలకమైనదని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌టీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ సి.మధుసూదన్‌రావు అన్నారు.

ఆధునిక సాంకేతికతతో రోగ నిర్ధారణ

రేడియాలజిస్టుల పాత్ర కీలకం 

ఏపీ ఈఎన్‌టీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ సి.మధుసూదన్‌రావు


నంద్యాల, మార్చి 1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగాలను నిర్ధారించడంలో రేడియాలజీ వైద్యుల పాత్ర కీలకమైనదని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌టీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ సి.మధుసూదన్‌రావు అన్నారు. నంద్యాలలోని మధుమణి నర్సింగ్‌ హోమ్‌ సమావేశ భవనంలో రాష్ట్ర రేడియాలజిస్టులు, చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్స వైద్యుల సదస్సును ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి రాష్ట్రస్థాయి రేడియాలజిస్టుల సదస్సును నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్‌ సీ మధుసూదన్‌రావు మాట్లాడుతూ రోగ నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రోగులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించి, వారి వ్యాధులను నిర్ధారించవచ్చని అన్నారు.


రేడియాలజీ వైద్యులు ఇచ్చిన రిపోర్టు మేరకు వైద్యం చేయడం వల్ల జబ్బులు వేగంగా తగ్గుతున్నాయని అన్నారు. ప్రముఖ రేడియాలజీ వైద్యులు డాక్టర్‌ ఫణీల్‌కుమార్‌, డాక్టర్‌ లలితకుమారి, డాక్టర్‌ డేవిడ్‌, డాక్టర్‌ జయప్రకాష్‌రెడ్డి రోగ నిర్ధారణలో సాంకేతికత గురించి వివరించారు. సీటీ, ఎంఆర్‌ఐ, అల్ర్టా సౌండ్‌ స్కానింగ్‌ల ఉపయోగాలను రేడియాలజిస్టులు, పీజీ రేడియాలజీస్టులు, ఈఎన్‌టీ వైద్యులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఎన్‌టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (ఎలెక్ట్‌) డాక్టర్‌ జె.శ్రీనాథ్‌, ఏపీ, తెలంగాణకు చెందిన 120 మంది రేడియాలజిస్టులు, ఈఎన్‌టీ నిపుణులు, స్థానిక వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:21:57+05:30 IST