దళారులను నమ్మొద్దు

ABN , First Publish Date - 2020-03-19T11:29:38+05:30 IST

అధిక దిగుబడితో పాటు తెగుళ్లు, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కే-6 రకం వేరుశనగ విత్తన కాయల్ని రైతులు దళారులకు విక్రయించి నష్టపోకుండా ఏపీ సీడ్స్‌ సంస్థకు అప్పగించి క్వింటానికి రూ.6,100లను పొందాలని జేడీ విల్సన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దళారులను నమ్మొద్దు

 కే-6 రకం వేరుశనగను ఏపీ సీడ్స్‌ సంస్థకు విక్రయించండి

రైతులకు జేడీ విల్సన్‌ 


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 18: అధిక దిగుబడితో పాటు తెగుళ్లు, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కే-6 రకం వేరుశనగ విత్తన కాయల్ని రైతులు దళారులకు విక్రయించి నష్టపోకుండా ఏపీ సీడ్స్‌ సంస్థకు అప్పగించి క్వింటానికి రూ.6,100లను పొందాలని జేడీ విల్సన్‌  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఖరీ్‌ఫలో రైతులకు సబ్సిడీపై 30 వేల క్వింటాళ్ల విత్తన కాయల్ని పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.


  ఈ విత్తన కాయలకు క్వింటంపై రూ.6,100 అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  గతంలో లాగా డబ్బులు ఆలస్యంగా చెల్లించరని,  ఏపీ సీడ్స్‌ సంస్థకు విక్రయించిన 48 గంటల్లో  రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ అవుతాయని అన్నారు.  ఈసారి ఏపీ సీడ్స్‌ సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలనే సేకరించి రైతులకు పంపిణీ చేస్తామని జేడీ విల్సన్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-19T11:29:38+05:30 IST