-
-
Home » Andhra Pradesh » Kurnool » dont forgive them
-
వారిని భవిష్యత్ తరాలు క్షమించవు
ABN , First Publish Date - 2020-12-10T05:54:54+05:30 IST
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములు బీడు భూములని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించవని ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి ఏవీ రమణ అన్నారు.

- ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికుల నిరసన
నంద్యాల, డిసెంబరు 9: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములు బీడు భూములని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించవని ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి ఏవీ రమణ అన్నారు. బుధవారం ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ద్వారం వద్ద తలకిందులుగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. 114 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్ భూమిని వైద్య కళాశాలకు కేటాయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బీడు భూములని చెప్పడంలో ఎంపీ, ఎమ్మెల్యేదే ప్రధాన పాత్ర అని అన్నారు. ఈ విషయం హైకోర్టుకు కూడా తెలపడం వీరిద్దరి కుట్రలో భాగమన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు నంద్యాల చుట్టుపక్కల ఖాళీగా ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను తీసుకోవచ్చని అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ చుట్టూ ఉన్న తమ భూములు, స్థలాలు, నిర్మాణాలకు మూడింతల రేట్లు పెంచుకునేందుకే ఎంపీ, ఎమ్మెల్యే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారని ఆరోపించారు. కార్మిక సంంం నాయకులు ఖాదర్‌వలి, నాగప్రసాద్, సుజాత, ఎల్లమ్మ, ఖాజాబీ, నాగేశ్వరమ్మ, భారీ సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.