ఉపాధిపై దెబ్బకొట్టొద్దు
ABN , First Publish Date - 2020-12-01T06:23:55+05:30 IST
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను కాపాడాలని, కార్మికులు, రైతుల ఉపాధిపై దెబ్బకొట్టొదని సీఐటీయూ నాయ కులు అన్నారు.
- ఆర్‌ఏఆర్‌ఎస్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో వంటా-వార్పు
నంద్యాల, నవంబరు 30: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను కాపాడాలని, కార్మికులు, రైతుల ఉపాధిపై దెబ్బకొట్టొదని సీఐటీయూ నాయ కులు అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వంటా-వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికుల సంఘం కార్యదర్శి రమణ, ఖాదర్‌వలి, పుల్లయ్య, సుజాత ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నాయకులు మాట్లాడుతూ ఆర్‌ఏఆర్‌ఎస్ భూమిని వైద్య కళాశాలకు కేటాయింపును ఉపసంహరించుకొని, జీవో 341ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడుకునేందుకు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్‌ఏఆర్‌ఎస్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.