కుక్కల దాడిలో 16 పొట్టేళ్ల మృతి
ABN , First Publish Date - 2020-12-13T05:52:12+05:30 IST
మండలంలోని చిలుకలూరు గ్రామంలో శుక్రవారం రాత్రి గుడిసెలో ఉన్న పొట్టెళ్లపై కుక్కలు దాడి చేశాయి.

రుద్రవరం, డిసెంబరు 12: మండలంలోని చిలుకలూరు గ్రామంలో శుక్రవారం రాత్రి గుడిసెలో ఉన్న పొట్టెళ్లపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 16 పొట్టేళ్లు మృతి చెందగా 4 పొట్టేళ్లు తీవ్రంగా గాయపడినట్లు బాధితుడు శనివారం తెలిపారు. ఎర్రగుడిదిన్నె పశువైద్యాధికారి కిషోర్‌కుమార్‌రెడ్డి చనిపోయిన పొట్టళ్ల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పొట్టేళ్ల కళేబరాలను ఒకే గుంతలో ఖననం చేయించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు. సుమారు రూ.2 లక్షలు నష్టంవాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.2 లక్షలు నష్టపోయా
నాలుగు రోజుల క్రితం పొట్టేళ్లు కొనుగోలు చేశా. రాత్రి గుడిసెలో ఉన్న పొట్టేళ్లపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. రూ.2 లక్షలు నష్టపోయా.
-రాజు, బాధిత రైతు