డాక్టర్‌ ఇస్మాయిల్‌ సేవలు విలువైనవి: ఎంపీ టీజీ

ABN , First Publish Date - 2020-12-07T05:15:54+05:30 IST

కర్నూలు అభివృద్ధికి దివంగత పేద ప్రజల వైద్యుడు డాక్టర్‌ ఇస్మాయిల్‌ చేసిన సేవలు వెలకట్ట లేనివని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

డాక్టర్‌ ఇస్మాయిల్‌ సేవలు విలువైనవి: ఎంపీ టీజీ
కల్లోలం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ, కలెక్టర్లు

కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 6: కర్నూలు అభివృద్ధికి దివంగత పేద ప్రజల వైద్యుడు డాక్టర్‌ ఇస్మాయిల్‌ చేసిన సేవలు వెలకట్ట లేనివని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం టీజీవీ కళాక్షేత్రంలో దివంగత ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఇస్మాయిల్‌ సంస్మరణ సభ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ సభాధ్యక్షత వహించగా, కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తొలుత డాక్టర్‌ ఇస్మాయిల్‌ చిత్ర పటానికి అతిథులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కరోనాపై రాసిన కల్లోలం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు డాక్టర్‌ ఇస్మాయిల్‌ను కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరినా, సున్నితంగా తిరస్కరించి తాను వైద్యునిగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని చెప్పారని గుర్తు చేశారు.   కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, కర్నూలు ్ల కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులుగా తాము కరోనా నివారణకు చేసిన కృషిని వివరించారు.  ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, డాక్టర్‌ ఇస్మాయిల్‌ మిత్రులు డాక్టర్‌  వాదిరాజ్‌, డాక్టర్‌ బాలమద్దయ్య, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కేఎన్‌వీ రాజశేఖర్‌, కళాకారులు బాల వెంకటేశ్వర్లు, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-07T05:15:54+05:30 IST