‘నాడు-నేడు పనులలో జిల్లాకు 12వ స్థానం’

ABN , First Publish Date - 2020-07-22T10:39:44+05:30 IST

రాష్ట్రంలో నాడు-నేడు పనులతో పోల్చుకుంటే కర్నూలు జిల్లా 12వ స్థానంలో ఉందని డీఈవో సాయిరాం అన్నారు. మంగళవారం కోసిగిలోని

‘నాడు-నేడు పనులలో జిల్లాకు 12వ స్థానం’

కోసిగి, జూలై 21: రాష్ట్రంలో నాడు-నేడు పనులతో పోల్చుకుంటే కర్నూలు జిల్లా 12వ స్థానంలో ఉందని డీఈవో సాయిరాం అన్నారు. మంగళవారం కోసిగిలోని మౌంట్‌ కార్నల్‌ ప్రైవేటు పాఠశాలలో కోసిగి, కౌతాళం మండలాలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు, కాంట్రాక్టర్లకు, అధికారులకు సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ నాడు-నేడు కింద జిల్లాలో 1,007 పాఠశాలలు ఎంపిక అయ్యాయని, ఇప్పటి వరకు వీటికి నాలుగు విడతల్లో రూ.83 కోట్లు ఖర్చు చేసినట్లు  తెలిపారు.


కోసిగి, పెద్దకడుబూరు మండలాల్లో  నాడు-నేడు పనులలో పూర్తిగా వెనుకబడి ఉందని, ఎంఈవో సుదర్శన్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసి నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోసిగి, కౌతాలం మండలాల ఎంఈవోలు, జిల్లా విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-22T10:39:44+05:30 IST