పింఛన్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-03-02T11:20:56+05:30 IST

పింఛన్‌ల పంపిణీలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశించడంతో శనివారం రాత్రి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కంటిమీద కునుకులేదు.

పింఛన్ల పంపిణీ

 తెల్లవారు జామునే మొదలు

వలంటీర్లు.. సచివాలయ ఉద్యోగుల అవస్థలు


కర్నూలు(కలెక్టరేట్‌) మార్చి 1: పింఛన్‌ల పంపిణీలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్చి 1వ తేదీ ఉదయం 11 గంటలకే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశించడంతో శనివారం రాత్రి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కంటిమీద కునుకులేదు. తెలవారు జామున 3.30 గంటల నుంచే పంపిణీని ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగులు వారిని పర్యవేక్షించారు. తెల్లవారితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ బిజీ అవుతుందని, తమ కోటా పింఛన్‌ల పంపిణీ నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని వలంటీర్లు తంటాలు పడ్డారు. తెల్లవారు జామున 3.30 గంటలకే లబ్ధిదారులను నిద్రలేపి పింఛన్‌ను అందజేశారు. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌ జాబితాలో పింఛన్‌  రూ.2,250 ఉండగా, మంజూరైనది మాత్రం రూ.500 మాత్రమే కావడంతో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. 


జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 19 వేల మంది వలంటీర్లు ఉన్నారు. వీరంతా పింఛను పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు. వలంటీర్లకు సెల్‌ఫోన్‌లు, బయోమెట్రిక్‌ యంత్రాలు పంపిణీ చేశారు. ఒక్కో వలంటీరుకు సగటున 30 పింఛన్లు పంపిణీ బాధ్యత ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నానికి పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో 4,24,000 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో దివ్యాంగులు, డప్పు కళాకారులు, చర్మకారులకు రూ.3 వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.10 వేలు, మిగిలిన వారికి రూ.2,250 చొప్పున అందజేశారు. కర్నూలు నగరంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  

Updated Date - 2020-03-02T11:20:56+05:30 IST