ఇంటర్‌ మూల్యాంకనం నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-21T11:21:19+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం నిలిపివేస్తూ ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆర్‌ఐవో సాలాబాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ మూల్యాంకనం నిలిపివేత

 సెలవులు ప్రకటించిన  బోర్డు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 20: కరోనా వైరస్‌ ప్రభావంతో ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం  నిలిపివేస్తూ ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆర్‌ఐవో సాలాబాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి స్థానిక ప్రభుత్వ (టౌన్‌) జూనియర్‌ కళాశాలలో జరిగే స్పాట్‌ వాల్యూయేషన్‌ను నిలిపివేస్తూ ఇంటర్‌ బోర్డు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మళ్లీ ఎప్పుడు స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించేది తేదీని ప్రకటిస్తామని ఆర్‌ఐవో తెలిపారు. 

Updated Date - 2020-03-21T11:21:19+05:30 IST