ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు

ABN , First Publish Date - 2020-12-20T05:52:00+05:30 IST

దనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు ఎర్రమట్టిని దోచుకుంటున్నారు. మండలంలోని చిల్లబండ, గోరంట్ల రహదారిలో ఉన్న కొండను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు.

ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు
ఎక్సవేటర్‌తో కొండను తవ్వుతున్న దృశ్యం

 కోడుమూరు (రూరల్‌), డిసెంబరు 19:  దనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు  ఎర్రమట్టిని దోచుకుంటున్నారు. మండలంలోని చిల్లబండ, గోరంట్ల రహదారిలో ఉన్న కొండను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అధికారులకు తెలిసి జరుగుతుందో లేక కన్నుగప్పి చేస్తున్నారో తెలియడం లేదు. ట్రాక్టర్‌ ఎర్రమట్టి ఒక్కో ట్రిప్పు రూ.700 వరకు విక్రయించి  సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం గోరంట్లకు చెందిన ఎక్సకవేటర్‌ యజమాని  ఎక్సవేటర్‌ ద్వారా ఎర్రమట్టి తవ్వించి ట్రాక్టర్లలో తరలించుకపోయారు. వారం రోజులుగా గోరంట్లకు చెందిన ఎక్సకవేటర్‌ యజమాని ఎర్రమట్టిని ఇష్టారాజ్యం గా తవ్వుతున్నట్లు తెలిసింది. తహసీల్దార్‌ ఉమామహేశ్వరమ్మ మాట్లా డుతూ కోడుమూరు పట్టణంలో ఇళ్లస్థలాల అభివృద్ధికి ఉపాధి హామి పథకం సిబ్బంది ఎర్రమట్టి తవ్వకాలకు అనుమతి తీసుకున్నారని తెలిపారు. వేరే ఎవరికి అనుమతి లేదన్నారు.  

Updated Date - 2020-12-20T05:52:00+05:30 IST