లే అవుట్‌ పనులను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2020-07-05T11:12:23+05:30 IST

మండలంలోని పి.రుద్రవరం సమీపంలో రెవెన్యూ అధికారులు చేపడుతున్న ప్రభుత్వ లే అవుట్‌ పనులను శనివారం బాధిత రైతులు

లే అవుట్‌ పనులను అడ్డుకున్న రైతులు

నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా  

 8న ఇస్తామని కమిషనర్‌ హామీ


కర్నూలు(రూరల్‌), జూలై 4: మండలంలోని పి.రుద్రవరం సమీపంలో  రెవెన్యూ అధికారులు చేపడుతున్న ప్రభుత్వ లే అవుట్‌ పనులను శనివారం బాధిత రైతులు అడ్డుకున్నారు. తమ భూములకు నష్టపరిహా రం ఇవ్వాలని ధర్నా చేశారు. కర్నూలు అర్బన్‌ లబ్ధిదారులకు రుద్రవరం పరిధిలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు పి.రుద్రవరంతోపాటు, ఎన్‌ఎ్‌స తాండ గ్రామాల రైతుల నుంచి 376 ఎకరాల భూమిని అఽధికారులు తీసుకున్నారు. భూములిచ్చిన 196 మంది రైతులకు ఎకరాకు రూ.18లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 


అధికారులు వారం క్రితం పరిహారం డబ్బు లు ఇస్తామని ఆర్డీవో కార్యాలయంలో రైతుల నుంచి సంతకాలు పెట్టించుకున్నారు. అయితే నేటికీ కూడా పరిహారం అందకపోవడంతో తమ భూముల్లో అధికారులు చేపడుతున్న లే అవుట్‌ పనులను రైతులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు పనులు జరగనివ్వమంటూ ఎక్స్‌కవేటర్‌కు అడ్డంగా కూర్చున్నారు. విషయం  తెలుసుకున్న జేసీ రవిపట్టన్‌శెట్టి, కమిషనర్‌ బాలాజీ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈనెల 8వ తేదీలోపు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించుకున్నారు. 

Updated Date - 2020-07-05T11:12:23+05:30 IST