-
-
Home » Andhra Pradesh » Kurnool » development through welfare
-
సంక్షేమ పథకాలతోనే ప్రగతి: మంత్రి
ABN , First Publish Date - 2020-12-31T05:02:22+05:30 IST
జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

హాలహర్వి, డిసెంబరు 30: జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రగతి సాధ్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం చింతకుంట గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన ఘతన సీఎం జగన్మోహన్‌రెడ్డిదని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ భీమప్పచౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జనార్ధన్‌నాయుడు, చింతకుంట వెంకటేశ్, రమేష్, చింతకుంట సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ శ్రీనివాసులు, తహసీల్దార్ సతీష్, ఎంపీడీవో ఆంటోనీ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ నాగేంద్ర పాల్గొన్నారు.
పెద్దకడబూరు: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం పెద్దకడు బూరులోని మెడల్ స్కూల్ దగ్గర ఇళ్లస్థల పట్టాల పంపీణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వీరపాండియన్, జేసీ రాంసుందర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రావు, డిప్యూటీ కలెక్టర్ మోహాన్‌దాస్, ఆర్డీవో రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి, ఏఈ వేణుగోపాల్, మెడికల్ ఆఫీసర్ డా.శాంతిజ్యోతి, నాయకులు పురుషోత్తం రెడ్డి, రాంమ్మెహాన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విజేంద్రరెడ్డి, గజేంద్ర రెడ్డి, చంద్రశేఖర్, ముక్కరన్న పాల్గొన్నారు.