బన్నిపై ఉత్కంఠ
ABN , First Publish Date - 2020-10-25T17:15:09+05:30 IST
కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి అవగాహన..
ఆలూరు(కర్నూలు): కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పించారు. 144 సెక్షన్ కూడా విధించారు. ఏటా విజయదశమి నాడు జరిగే బన్ని ఉత్సవాన్ని ఈ ఏడాది నిర్వహించవద్దని అధికారులు విన్నవిస్తున్నారు. భక్తులు దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది తేలాల్సి ఉంది. కొవిడ్ అవాంతరాలు లేకపోతే ఈ నెల 26 అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరిగేది. బన్ని ఉత్సవం తప్ప మిగిలిన పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది.