రైతులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2020-12-04T05:12:21+05:30 IST
నివర్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

- టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి
శిరివెళ్ల, డిసెంబరు 3: నివర్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శిరివెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు కుమార్ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మృతదేహానికి జగత్ విఖ్యాత్‌రెడ్డి గురువారం నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం అందేంత వరకు పోరాడతామన్నారు. టీడీపీ మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, యామా గుర్రప్ప, సూరా రామ, ఇస్మాయిల్, యామా శ్రీనివాసులు, నాలి వలి, బాలచంద్రుడు, నంద్యాల మౌలిబాషా, పీపీ లింగమయ్య పాల్గొన్నారు.