-
-
Home » Andhra Pradesh » Kurnool » Death Baby Crime News
-
ముళ్ల పొదల్లో మృత శిశువు
ABN , First Publish Date - 2020-12-28T05:24:22+05:30 IST
మండలంలోని పేరాయిపల్లె గ్రామంలోని జిన్ను వీధిలోని కందుల గోపాలరెడ్డి కలంలో ఆదివారం మృత శిశువు కన్పించింది.

ఆళ్లగడ్డ, డిసెంబరు 27: మండలంలోని పేరాయిపల్లె గ్రామంలోని జిన్ను వీధిలోని కందుల గోపాలరెడ్డి కలంలో ఆదివారం మృత శిశువు కన్పించింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. గ్రామంలోని ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు నమోదు చేసుకున్న గర్భిణుల వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో గర్భిణులు ఎవరూ లేరని వారు పోలీసులకు తెలిపారు. శిశువు మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సుమోటోగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు.