ఆటోను ఢీకొన్న కారు.. తల్లీకూతుళ్ల మృతి

ABN , First Publish Date - 2020-11-06T06:24:25+05:30 IST

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఆటోను ఢీకొన్న కారు.. తల్లీకూతుళ్ల మృతి
రోదిస్తున్న కుటుంబ సభ్యులుఆటోను ఢీకొన్న కారు

  • ఆరుగురికి గాయాలు


ఓర్వకల్లు: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓర్వకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో ఓ ఆటోను కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గడివే ముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన నగిరి వెంకటలచ్చమ్మ(60), ఆమె కూతురు వెంకటలక్ష్మి(40) మృతి చెందారు. అదే గ్రామా నికి చెందిన శ్రావణి, ఫణిలక్ష్మి, ఆటో డ్రైవర్‌ నాగేశ్వరరావు, ఓర్వకల్లు మండలం తిప్పాయ పల్లె గ్రామానికి చెందిన అనిత, సామన్న, చరణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ గూడూరు మండలం బూడిదపాడుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను వెనుక నుంచి ఢీకొన్నట్లు బాధితులు తెలిపారు. 


ఆలస్యంగా అంబులెన్సు..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు చేరుకోడానికి 40 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అంతవరకూ గాయపడ్డవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాయపడ్డ ఎనిమిది మందిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీకూతుళ్లు మృతి చెందారు. 108 వాహనాన్ని ఓర్వకల్లులోనే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఏఎస్‌ఐ రామిరెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-11-06T06:24:25+05:30 IST