-
-
Home » Andhra Pradesh » Kurnool » cvs rogulaku marugaina chikisha
-
సీవీఎస్ రోగులకు మెరుగైన చికిత్స
ABN , First Publish Date - 2020-12-19T05:33:31+05:30 IST
కర్నూలు పెద్దాసుపత్రిలో అత్యవసర రోగులకు మెరుగైన సేవలు అందించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీ.నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సి. ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

- సర్జికల్ ఐసీయూ, న్యూరో సర్జరీ ఐసీయూలో ప్రత్యేక ఏర్పాట్లు
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 18: కర్నూలు పెద్దాసుపత్రిలో అత్యవసర రోగులకు మెరుగైన సేవలు అందించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జీ.నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సి. ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సూపరింటెండెంట్ చాంబర్‌లో అత్యవసర సేవలపై వారు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అత్యవసర రోగులకు సేవలు అందించే ఏఎంసీపై భారం తగ్గించి, ఇతర వార్డుల్లో సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు సర్జికల్ పోస్టు ఆపరేటివ్ వార్డును సర్జికల్ ఐసీయూ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూరో సర్జరీ వార్డులో 10 వెంటిలేటర్లతో ఐసీయూని ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మూడు వెంటిలేటర్లును న్యూరోసర్జరీ ఐసీయూకు అందజేశామన్నారు. ఏఎంసీపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఏఎంసీలో ఉన్న సర్జికల్ ఐసీయూలో మరికొన్ని అత్యవసర కేసులకు చికిత్స అందే అవకాశాలున్నాయని తెలిపారు.