ఇంటి విద్యుత్ బిల్లు రూ.25 వేలు
ABN , First Publish Date - 2020-08-12T09:55:33+05:30 IST
ఇంటి విద్యుత్ బిల్లు రూ.25 వేలు

- మరీ ఇంతనా..!
హొళగుంద : హొళగుంద పట్టణానికి చెందిన రమేష్ అనే రైతుకి విద్యుత్ శాఖ అధికారులు బిల్లుతో షాక్ ఇచ్చారు. ఒక ఫ్యాను, రెండు బల్బులు, ఓ టీవీ ఉన్న ఇంటికి ఈ నెల ఏకంగా రూ.25 వేలు బిల్లు వేశారు. సర్వీస్ నెంబరు 8112407004258 పై గత మూడు నెలల నుంచి బిల్లు ఎక్కువగా వస్తోందని, ఈ నెల మరీ భరించలేనంత వేశారని బాధితుడు వాపోతున్నాడు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, కొత్త మీటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు.