దైవ మార్గంలో నడిపేందుకే క్రీస్తు జననం

ABN , First Publish Date - 2020-12-26T05:56:42+05:30 IST

దారితప్పిన మానవజాతి నడతను సరిచేసి, దైవమార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు ఈ లోకాన జన్మించారని మతపెద్దలు ఉద్బోధించారు.

దైవ మార్గంలో నడిపేందుకే క్రీస్తు జననం
కర్నూలులో లూర్డు మాత చర్చిలో ప్రార్థనలు చేస్తున్న కైస్త్రవులు

  1. దైవ మార్గంలో నడిపేందుకే క్రీస్తు జననం


కర్నూలు(కల్చరల్‌), డిసెంబరు 25:  దారితప్పిన మానవజాతి నడతను సరిచేసి, దైవమార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు ఈ లోకాన జన్మించారని మతపెద్దలు ఉద్బోధించారు. నగరంలో చర్చిలలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌ వేడుక లక్ష్యాన్ని తమ సందేశం ద్వారా వినిపించారు. ఆర్‌ఎస్‌ కూడలిలోని షమ్మ చర్చిలో పాస్టర్‌ స్టీఫెన్‌ చార్లెస్‌, హోసన్న ప్రార్థన మందిరంలో పాస్టర్‌ ఫ్రెడ్డీ పాల్‌, సీఎ్‌సఐ చర్చిలో పాస్టర్‌ రెవ. పీఏ వరప్రసాద్‌రావు, సి.క్యాంపులోని ప్రార్థన మందిరంలో రెవ. పి. ప్రకావ్‌ క్రిష్టఫర్‌  సందేశమిచ్చారు. బేత్లెహోము చర్చిలో పాస్టర్‌ జేబాస్‌ వాట్స్‌ క్రిస్మస్‌ ప్రాముఖ్యతను వివరించారు. హోరెబు ప్రార్థనా మందిరంలో పాస్టర్‌ సమ్సోనన్న క్రీస్తు పుట్టుక ప్రాముఖ్యతను తెలియజేశారు. కోల్స్‌ సెంటీనియల్‌ తెలుగు బాప్టిస్టు చర్చిలో పాస్టర్‌ ఆర్‌పీ సజీవన్‌ దైవ సందేశం ఇచ్చారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా చర్చిలలో ఆరాధన కార్యక్రమాలు ప్రత్యేకంగా కొనసాగాయి. క్వాయర్‌ బృందాలు క్రీస్తును స్తుతిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. 


కర్నూలు(న్యూసిటీ): మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నగరంలోని చర్చిల్లో జరిగిన  కిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎ్‌సఐ, స్టాంటాన్‌, గిప్సన్‌, కోల్స్‌ చర్చిల్లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బైబిల్‌లోని అంశాలను, స్తోత్రాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యరాజు, సుందరాజ్‌, కిషన్‌, ఏసు, పరుశరాం, లాజర్‌, వన్నెస్‌ పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు టౌన్‌: ఎమ్మిగనూరు పట్టణం, గ్రామాల్లో కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే నూతన వస్త్రాలు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయా చర్చిల ఫాదర్లు ప్రజలకు దైవ సందేఽశం వినిపించారు. ఎంబీ చర్చిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 


ఆదోని టౌన్‌: పట్టణంలో అన్ని చర్చీలలో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆర్‌సీఎం చర్చిలో రెవరెండ్‌ ఫాదర్‌ విజయరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికి పంచి పెట్టారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రార్థనలు నిర్వహించారు. 


దేవనకొండ: మండల కేంద్రమైన దేవనకొండతో పాటు మండలంలోని పొట్లపాడు, తెర్నేకల్లు, కోటకొండ, కరివేములతోపాటు వివిధ  గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఆయా గ్రామాల్లోని చర్చీలలో క్రిస్మస్‌ సోదరులు క్రిస్మ్‌సను పురస్కరించుకుని  ప్రార్థనలు నిర్వహించి, ఒకరినొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు.

క్రిస్మస్‌ వేడుకల్లో తిక్కారెడ్డి


మంత్రాలయం: మంత్రాలయంతో పాటు అయా గ్రామల్లో క్రిస్మస్‌ వేడు కలను ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారు జాము నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రచ్చుమర్రి సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్‌మస్‌ వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ప్రత్యేక పార్థనలో పాల్గొన్నారు. వీరికి పాస్టర్‌ ఘనంగా సన్మానం చేశారు. మంత్రాలయం సీఎస్‌ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు. ఎసుక్రీస్తు జన్మ విశిష్టతను పాస్టర్‌ తెలియజేశారు. 


Updated Date - 2020-12-26T05:56:42+05:30 IST