కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

ABN , First Publish Date - 2020-04-08T10:53:54+05:30 IST

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో గూగుల్‌ మ్యాప్‌లో జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉండాలని అడిషినల్‌ డీజీ

కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

 రెడ్‌జోన్‌ ప్రాంతాలకు జియో ట్యాగింగ్‌ 

 అడిషినల్‌ డీజీ శ్రీధర్‌రావు 


కర్నూలు, ఏప్రిల్‌ 7: రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో గూగుల్‌ మ్యాప్‌లో జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉండాలని అడిషినల్‌ డీజీ శ్రీధర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ ఫక్కీరప్పలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులు నివసించే రెడ్‌జోన్‌ ప్రాంతాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో వాటిని గూగుల్‌ మ్యాప్‌లో మార్క్‌ చేసి ఉంచాలన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలలో ఎన్ని మీటర్ల వరకు ఎంత మంది పోలీసు బందోబస్తు ఉంటున్నారనే విషయాలపై చర్చించారు. కోవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పని చేసే అధికారులు, సిబ్బంది కరోనా పాజిటివ్‌, నెగిటివ్‌ కేసుల నిర్ధారణ డేటాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు.


జిల్లాలో ఎంతమంది ఎన్ని క్వారంటైన్‌లలో ఉంటున్నారో, క్వారంటైన్‌ల నుంచి వెళ్తున్నారనే ప్రతి అంశాన్ని డేటా రూపంలో కమాండ్‌ కంట్రోల్‌ నమోదు చేస్తుంటారన్నారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ రెడ్‌జోన్‌ ప్రాంతాల్లోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కమాండ్‌ కంట్రోల్‌ నెంబర్‌. 9121101207ను సంప్రదించాలన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ అడ్మిన్‌ గౌతమి, ట్రైనీ ఐపీఎస్‌ తుషార్‌, ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ రాధాక్రిష్ణ, డీఎస్పీలు రమణమూర్తి, వెంకటాద్రి, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఇన్‌చార్జి డీఎస్పీ నాగభూషణం, ట్రైనీ డీఎస్పీలు భవ్యకిషోర్‌, మెహర్‌ జయరాం ప్రసాద్‌, ఈకాప్స్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, ఈకాప్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-08T10:53:54+05:30 IST