ఇబ్బంది పడుతున్నాం..!

ABN , First Publish Date - 2020-03-24T11:09:05+05:30 IST

కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరిస్తున్నాయి. కానీ కాస్త ముందుగానే జాగ్రత్త పడుంటే తమకు ఇబ్బందులు తప్పేవని అంటున్నారు.

ఇబ్బంది పడుతున్నాం..!

పరిమితంగా బస్సులు, ఆలోలు తిప్పాలి

ఇంకాస్త ముందుగానే స్పందించాల్సింది

లాక్‌డౌన్‌పై నగరవాసుల అభిప్రాయం


కర్నూలు(ఆంధ్రజ్యోతి), మార్చి 23: కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు సహకరిస్తున్నాయి. కానీ కాస్త ముందుగానే జాగ్రత్త పడుంటే తమకు ఇబ్బందులు తప్పేవని అంటున్నారు. ఒకేసారి ఇళ్లకు పరిమితం కావాలని చెప్పడంతో చేతులు కాళ్ళు కట్టేసినట్లు ఉందని అంటున్నారు. అత్యవసర పనులు, నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు, బస్సులు లేక నగర వాసులు కిలో మీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


పరిమితంగానైనా ఆటోలు, బస్సులను అనుమతించాలని కోరుతున్నారు. కూలీనాలి చేసుకునేవారు దూరంగా వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొందరు నిబంధనలను అతిక్రమించి బయటకు వెళుతున్నారు. రైతు బజార్లలో రద్దీ పెరిగింది. నిత్యావసరాల కోసం దుకాణాల వద్ద గుంపులుగా చేరుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. పోలీసులు నగర పరిసరాల్లోకి వాహనాలను రానివ్వకుండా చూడటానికి పరిమితమైపోయారు. 


స్వచ్ఛందంగా పాటించాలి..కిషోర్‌, కర్నూలు

కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగానే ఉన్నాయి. ప్రజలే స్వీయ రక్షణ చర్యలు పాటించేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఇంకాస్త ముందుగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. ప్రజా రవాణా ఒకేసారి ఆపేశారు. సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరం. బస్సుల్లో పరిమితంగా ప్రయాణికులను ఎక్కించి నడిపితే మేలు.  


పండుగ చేయలేం.. శోభారాణి, కర్నూలు

లాక్‌డౌన్‌ కారణంగా పండుగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు  ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. 



Updated Date - 2020-03-24T11:09:05+05:30 IST