పట్టణాల్లో వేగంగా కరోనా

ABN , First Publish Date - 2020-05-09T08:33:55+05:30 IST

పట్టణాల్లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని, దానిని అరికట్టేందుకు జిల్లా అధికారులు అప్రమత్తంగా

పట్టణాల్లో వేగంగా కరోనా

 అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 కలెక్టర్‌ వీరపాండియన్‌


కర్నూలు, మే 8(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని, దానిని అరికట్టేందుకు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 540 పాజిటివ్‌ కేసులకు అదనంగా శుక్రవారం మరో 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొత్తగా ఆదోని మున్సి పాల్టీలో మరో పాజిటివ్‌ కేసు, మహానంది మండలంలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అ న్నారు.  పట్టణ ప్రజలు వైర్‌సను అరికట్టడానికి అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగానికి సహకరించాలని అన్నారు. వలస కూలీలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని, ఇంకా ఎక్కువ పాజిటివ్‌ కేసు లు వచ్చే అవకాశం ఉందని అన్నారు.


బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిని కచ్చితంగా 14 రోజు లపాటు క్వారంటైన్‌లో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను శ్రామిక్‌ రైలు ద్వారా తమ స్వస్థ లాలకు పంపుతున్నామన్నారు.  గురువారం జార్ఖండ్‌కు చెందిన 1,126 మందిని పంపామని, శుక్రవా రం ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన 1,145 మందిని పంపుతున్నామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలలో ఉండే మన జిల్లా ప్రజలను తీసుకువచ్చేందుకు చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ముంబై నుంచి 254 మందిని, బళ్ళారి నుంచి 186 మందిని తీసుకువచ్చి ఆదోని డివిజన్‌లోని పలు ప్రాంతాలలో క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచామన్నారు. చెక్‌పోస్టుల ద్వారా కాకండా ఇతర మార్గాల ద్వారా వచ్చే వలస కార్మికులను గ్రామ స్థాయి కమిటీ సభ్యులు గుర్తించి క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


జిల్లాలో ఇప్పటి వరకు 17,700 టెస్టులు నిర్వహించామన్నారు. గురువారం వైజాగ్‌ పాలిమర్‌ గ్యాస్‌ లీకేజి ఘటనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న 5 పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్‌ తెలిపారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సందర్భంగా సరిహద్దు రాష్ట్రాలలో అత్యవసర వైద్య సేవల కోసం అనుమతి కోరుతూ 9,436 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో కేవలం 490 మందికి మాత్ర మే అర్హత పొందారని, అత్యవసరం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్‌ను ఉల్లఘించిన వారి వాహనాలు సీజ్‌ చేశామని, లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాతే ఎంవీ యాక్ట్‌ ప్రకారం జరిమానా వేసి వాహనాలను సంబంధిత వ్యక్తులకు స్వాధీనం చేస్తామన్నారు.  

Updated Date - 2020-05-09T08:33:55+05:30 IST