నంద్యాలను వణికిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-04-21T06:47:30+05:30 IST
నంద్యాలను కరోనా వణికిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమ వారం మరో 5 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో...

- నంద్యాల పట్టణంలో 39, రూరల్‌లో 9 పాజిటివ్ కేసులు
- రెడ్‌జోన్‌ల్లో బయటకు వస్తున్న ప్రజలు
నంద్యాల, ఏప్రిల్ 20: నంద్యాలను కరోనా వణికిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమ వారం మరో 5 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో 48కి చేరింది. మున్సిపాలిటీ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ - జగజ్జననీ నగర్‌లో 3 కేసులు, బీసీ కాలనీలో ఒకటి, బొంత లవీధిలో ఒకటి, దేవనగర్ - వీసీ కాలనీలో 11, ఫరూక్ నగర్‌లో ఒకటి, గుడిపాటిగడ్డలో 3, గట్టాల్‌నగర్‌లో ఒకటి, కోటవీధిలో ఒకటి, మాల్‌దా ర్‌పేటలో 3, ముల్లాన్‌పేటలో 2, మున్సిపల్ క్వార్టర్స్‌లో ఒకటి, నడిగడ్డలో ఒక టి, నీలివీధిలో 2, పార్క్ రోడ్డులో 2, సలీంనగర్‌లో ఒకటి, శ్యామ్‌నగర్‌లో ఒక టి, టెక్కెలో ఒకటి, బైటి పేటలో ఒకటి, ఖాజీకోటలో ఒకటి, హరి జనపేటలో ఒకటి పాజిటివ్ కేసు లతో మొత్తం 39 నమోదు అయ్యాయి. రూరల్ పరిధిలో అయ్యలూరు గ్రా మంలో కేసుల సంఖ్య 5కు పెరుగగా, చాబోలులో 3 కేసులు, నూనెపల్లె కొలిమిపేటలో ఒక కేసు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.
డేంజర్ రెడ్‌జోన్‌లుగా మూడు ప్రాంతాలు:
నంద్యాల పట్టణంలో పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో కొత్తగా వచ్చిన కేసులు మూడు ప్రాంతాలలోనే ఎక్కువగా నమోదు కావడంతో డేంజర్ రెడ్ జోన్ ప్రాంతాలుగా ఆ వీధులు మారాయి. దేవనగర్ - వీసీ కాలనీ ప్రాంతాల్లో మొత్తం 11 కేసులు, పక్కనే ఉన్న శ్యామ్ నగర్‌లో మరో కేసు ఉండడంతో ఈ మూడు వీధులు ఒకే చోట ఉండటంతో డేంజర్ హాట్ స్పాట్‌గా మారింది. అలాగే ఆత్మకూరు బ స్టాండ్ - జగజ్జనీ నగర్‌లో 3 కేసులు, పక్కనే ఉన్న పార్క్ రోడ్డులో 2 కేసులు, ఫరూక్‌నగర్‌లో ఒకటి, కోటవీధిలో ఒకటి, గుడిపాటిగడ్డలో 3, మాల్‌దా రిపేటలో 3, ముల్లాన్‌పేటలో 2 కేసుల తో ఓల్డ్ సిటీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో డేంజర్ రెడ్‌జోన్‌గా మార డంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపో తున్నారు. రెండు రోజుల వ్యవధిలో పట్టణం లో ఏకంగా 19 కొత్త పాజిటీవ్ కేసులు రావడంతో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. రెడ్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా అమలు చేయా లని స్థానికు లెవ్వరూ ఇళ్ళల్లో నుంచి బయ టకు రాకుండా ఉండాలని, రెడ్‌జోన్‌లలోకి ఇతర ప్రాంతాల వారు ఎవరూ వెళ్ళకూడదని అధికారులు ప్రకటించారు. అయితే అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టిన ప్పటికీ రెడ్‌జోన్ ప్రాం తాలలో నివాసం ఉన్నవారు యథేచ్ఛగా బయటకు వచ్చి పోలీసులు ఏర్పా టు చేసిన బారికేడ్లను కూడా దాటి బయటకు వస్తున్నారు. కొత్తగా పాజి టివ్ కేసుల నమోదు విషయంలో కరోనా వైరస్ వ్యాప్తి సామాజికంగా వ్యా ప్తి చెందినట్లు వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం, అలస త్వంతో ఉంటే పరిస్థితి చేయి దాటిపోతుందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కరోనా భయం నంద్యాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.