కాంగ్రెస్‌ పార్టీ సముద్రంలాంటిది

ABN , First Publish Date - 2020-12-29T05:25:02+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సముద్రం లాంటిదని డీసీసీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సముద్రంలాంటిది
కర్నూలు కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట జెండాను ఎగుర వేస్తున్న నాయకులు

  1.  డీసీసీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 28: కాంగ్రెస్‌ పార్టీ సముద్రం లాంటిదని డీసీసీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌ అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అహ్మద్‌ ఆలీఖాన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్ర సమరయోధుల పార్టీ అని, గల్లీ నాయకులను కూడా ఢిల్లీకి పంపిన ఘనత ఆ పార్టీదేనని అన్నారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి కొండారెడ్డి బురుజు వద్ద గల గాంధీపార్కులో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు డీసీసీ అధ్యక్షుడు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, పీపీసీ అధికార ప్రతినిధి కరుణాకరబాబు, నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, నాయకులు ఖాజాహుసేన్‌, రవికుమార్‌, సారమ్మ, ప్రమీల, కేవీ లక్ష్మి, ఎల్లమ్మ పాల్గొన్నారు.


ప్యాపిలి: మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి సునిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ నాయకులు సుబ్బుయాదవ్‌, రామక్రిష్ణ, శేషయ్య పాల్గొన్నారు.


డోన్‌(రూరల్‌): డోన్‌ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి, జిల్లా కార్యదర్శి మల్లంపల్లె జనార్దన్‌ యాదవ్‌ల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించా రు. అలాగే పట్టణంలోని తారకరామ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో కాం గ్రెస్‌ నాయకులు రాజశేఖర్‌, గోపినాథరావు, రాం భూపాల్‌, హనుమాన్‌ పాల్గొన్నారు. 


ఆదోని టౌన్‌: దేశం లో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు గతంలో కాంగ్రెస్‌ హ యాంలో అమలు చేసినవేనని పార్టీ సీనియర్‌ నాయకుడు దినే్‌షధోకా అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. సీనియర్‌ నాయకుడు దినే్‌షధోకా, జిల్లా కార్యదర్శి మహమ్మద్‌నూర్‌, యువజన కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు మారుతిరావు మాట్లాడుతూ గతంలో గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ నాబార్డు, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, పేదల కోసం ఉపాధి హామీ పథకం ఇలా ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. 

Updated Date - 2020-12-29T05:25:02+05:30 IST