బాధితుల నుంచి ఫిర్యాదులు రాకూడదు
ABN , First Publish Date - 2020-09-18T11:14:39+05:30 IST
కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదులు రాకూడదని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. గురువారం స్థాని

ఆసుపత్రుల రేటింగ్ శాతాన్ని పెంచాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ఫిర్యాదులు రాకూడదని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆసుపత్రి మేనేజ్‌మెంట్ నోడల్ టీం అధికారులతో పాటు కొవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్స్‌తో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. జీజీహెచ్ కొవిడ్ ఆసుపత్రిలో వైద్యులు వార్డులను సందర్శించడంలేదని 29 శాతం, పారిశుధ్యం అధ్వానంగా ఉందని 41 శాతం, కరోనా బాధితులకు భోజనం సరైన సమయంలో అందడం లేదని 25 శాతం, మందులు ఇవ్వడం లేదని 18 శాతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అలాగే శాంతిరామ్, విశ్వభారతి, మెడికవర్, ఓమిని ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులను వైద్యులు సందర్శించడం, పారిశుధ్యం, భోజనం సకాలంలో అందించడం వంటి వాటిపై రేటింగ్ చాలా అధ్వానంగా ఉందన్నారు. కొవిడ్ ఆసుపతుల్ర్లో రేటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.