-
-
Home » Andhra Pradesh » Kurnool » collector samisha
-
భవన నిర్మాణాలు పూర్తి చేయండి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-25T06:21:29+05:30 IST
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ, వైఎ్‌సఆర్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.

కర్నూలు(అర్బన్), నవంబరు 24: గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ, వైఎ్‌సఆర్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లాలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించడం, నాడు-నేడు పనుల పురోగతి, మెటీరియల్ కాంపొనెంట్ కింద గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డ్వామా పీడీ అమర్‌నాథ్, పంచాయతీరాజ్ ఎ్‌సఈ సుబ్ర హ్మణ్యం, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.