సీఎం పర్యటన విజయవంతం

ABN , First Publish Date - 2020-11-21T06:28:52+05:30 IST

పవిత్ర తుంగభద్ర నది పుష్కరాల ప్రారం భోత్సవం సందర్భంగా సీఎం పర్యటన విజయవంతమైందని, దీనికి అందరూ కృషి చేసిన తీరు అభినందనీయమని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.

సీఎం పర్యటన విజయవంతం

  1. అందరి కృషి అభినందనీయం 
  2.  ఎస్పీ ఫక్కీరప్ప 

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 20: పవిత్ర తుంగభద్ర నది పుష్కరాల ప్రారం భోత్సవం సందర్భంగా సీఎం పర్యటన విజయవంతమైందని, దీనికి అందరూ కృషి చేసిన తీరు అభినందనీయమని  ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. తుంగభద్ర పుష్కరాల బందోబస్తు నిమిత్తం  శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయం పరేడ్‌ మైదానానికి  వచ్చిన పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. పుష్కరాలలో ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. కర్నూలు పోలీసులకు పుష్కరాల టీఏలు వారి ఖాతాలకు చేరాయన్నారు. ఇతర జిల్లాల పోలీసులకు, హోంగార్డులకు కూడా పుష్కరాల టీఏలు ఇస్తున్నామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం వ్యాస్‌ ఆడిటోరియంలో పోలీస్‌ అధికారులతో ఆయన మాట్లాడారు. పుష్కర ఘాట్‌లలో నిర్వహించవలసిన విధుల గురించి ఆదేశాలు జారీ చేశారు. ఘాట్‌ ఇన్‌చార్జి అధికారులు పుష్కర ఘాట్లు  పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండేలా  చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులతో  మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ గౌతమిశాలి, ట్రైనీ ఐపీఎస్‌ కొమ్మిప్రతాప్‌ శివకిషోర్‌, హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహన్‌, అడిషనల్‌ ఎస్పీలు మధుసూదన్‌ రావు, రుషి కేశవరెడ్డి (కడప), అర్జున్‌ (విజయవాడ), అనంతపురం ఓఎ్‌సడీ కేవీఆర్‌ ప్రసాద్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ రాధాకృష్ణ, డీఎస్పీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-21T06:28:52+05:30 IST