బెలుం గుహల మూసివేత
ABN , First Publish Date - 2020-03-22T10:55:19+05:30 IST
కొలిమిగుండ్ల మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెలుంగుహలను శనివారం మూసివేశారు.
కొలిమిగుండ్ల, మార్చి 21: కొలిమిగుండ్ల మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెలుంగుహలను శనివారం మూసివేశారు. గుహలను సందర్శించేందుకు ప్రతి రోజూ దూర ప్రాంతాల నుంచి సందర్శకులు, విద్యార్థులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ అధికమవుతుండడంతో బెలుం గుహలను మూసి వేయాలని గుహల మేనేజరు ఏఎంవీ కుమార్‌ను ఏపీ టూరిజంశాఖ ఆదేశించింది. ఈ మేరకు బెలుం గుహలను నుంచి మూసివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెస్టారెంట్, స్నాక్‌బార్, వసతిగృహం అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.