-
-
Home » Andhra Pradesh » Kurnool » childpai attak
-
చిన్నారిపై అత్యాచార యత్నం
ABN , First Publish Date - 2020-11-25T06:26:53+05:30 IST
పట్టణంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది.

ప్యాపిలి, నవంబరు 24: పట్టణంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై మంగళవారం బాధితురాలి తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి చాక్లెట్లు కొనుక్కోడానికి షాపుకు వెళ్లుతుండగా అదే కాలనీకి చెందిన యువకుడు చిన్నారికి మాయ మాటలు చెప్పి సమీపంలోని ఓ ఇంట్లోకి తీసికెళ్లాడు. చిన్నారి కేకలు విని కాలనీవాసులు రావడంతో యువకుడు పరారయ్యాడని ఎస్‌ఐ మారుతీశంకర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.