ఆ కుటుంబాలను ఆదుకున్నారు

ABN , First Publish Date - 2020-12-20T05:19:17+05:30 IST

కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై యర్రగుంట్ల వద్ద ఈ నెల 15న తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు.

ఆ కుటుంబాలను ఆదుకున్నారు
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, అధికారులు


శిరివెళ్ల, డిసెంబరు 19: కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై యర్రగుంట్ల వద్ద ఈ నెల 15న తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. బాధిత కుటుంబాలకు శనివారం యర్రగుంట్లలోని ఎస్సీ కాలనీలో పరిహారం అ్దఇంచారు. మృతి చెందిన, గాయపడిన బాధితలుకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.30.5 లక్షల పరిహారం చెక్కులను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి పంపిణీ చేశారు. మృతి చెందిన ఉప్పలపాటి ఝాన్సీ, సైగాళ్ల వంశీ, దాసరి సుష్మిత, దాసరి హర్షవర్ధన్‌, తోట సువర్ణమ్మ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన సైగాళ్ల మైథిలి, బాలబోయిన స్పందన, దాసరి లక్ష్మి, సుంకేసుల చెన్నమ్మ, మేకల మద్దిలేటమ్మ, భేతి అరవింద్‌, దాసరి చెన్నకేశవులు, కొత్తమాసు విజయ్‌ కుమార్‌, దాసరి నరసింహ, మట్టల లక్ష్మీ భార్గవ్‌కు రూ.50 వేలు చొప్పున పరిహారం చెక్కులను వారు పంపిణీ చేశారు. బాధితుల కుటుంబసభ్యులను వారు ఓదార్చి మృతుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.


‘మెరుగైన వైద్యం అందేలా చూస్తాం’


రహదారి ప్రమాదంలో గాయపడి నంద్యాల, కర్నూలు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలను ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. యర్రగుంట్ల ఎస్సీ కాలనీ చివరి వరకు సర్వీస్‌ రోడ్డును నిర్మించడంతో పాటు విమల పాఠశాల వద్ద జాతీయ రహదారిపై సబ్‌వేను నిర్మించాలని ఎస్సీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ కాలనీ ప్రధాన రహదారిలో కృంగి పోయిన సీసీ రహదారిని పునరుద్ధరించాలని వారు కోరారు. వైసీపీ నాయకులు గాజ కృష్ణారెడ్డి, ఎదుర్ల నాగేశ్వరరావు, ఇందూరి ప్రతాప్‌రెడ్డి, ఎస్‌పీ లాల్‌, పూల రామయ్య, ప్రతాప్‌రెడ్డి, శివారెడ్డి, సుబ్బసత్యనారాయణ, నజీర్‌, సలామ్‌, సుబ్బరాయుడు, చిన్న లాల్‌, చిన్న నాగిరెడ్డి, రాజారెడ్డి, తహసీల్దార్‌ నాగరాజు, ఆర్‌ఐ సుచరిత, ఇన్‌చార్జి ఎంపీడీవో సాల్మన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T05:19:17+05:30 IST