వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం కృషి

ABN , First Publish Date - 2020-11-16T05:22:38+05:30 IST

దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా ఏపీ శాఖ అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి అన్నారు.

వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం కృషి
మాట్లాడుతున్న శశిభూషణ్‌రెడ్డి

బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి

నంద్యాల, నవంబరు 15: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా ఏపీ శాఖ అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషన్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చుతామన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా, పెట్టుబడి సాయానికి చేయూత, రైతు నేరుగా తమ దిగుబడులను, వ్యవసాయ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా చేర్చి అమ్మేందుకు రవాణా వ్యవస్థ, ఇలా ఎన్నో రైతు సంక్షేమ, వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం పాటుపడుతోందన్నారు. కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరాజు, బీజేపీ నాయకులు డాక్టర్‌ ఇంటి ఆదినారాయణ, బిజ్జం సుబ్బారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-16T05:22:38+05:30 IST