బాధ్యతలు స్వీకరించిన సీసీఎస్ డీఎస్పీ
ABN , First Publish Date - 2020-12-13T05:57:31+05:30 IST
కర్నూలు సీసీఎస్ డీఎస్పీగా ఎ.శ్రీనివాసులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

కర్నూలు, డిసెంబరు 12: కర్నూలు సీసీఎస్ డీఎస్పీగా ఎ.శ్రీనివాసులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. చిత్తూరు జిల్లాకు చెం దిన శ్రీనివాసులు 1995 బ్యాచ్‌లో ఎస్‌ఐగా పోలీ్‌సశాఖలో చేరారు. కోసిగి, రుద్రవరం, ఆదోని 1టౌన్, ఎమ్మిగనూరు టౌన్, దేవనకొండ, కౌతాళం పోలీ్‌సస్టేషన్‌లలో ఎస్‌ఐగా పని చేశారు. సీఐగా 2007లో పదోన్నతి పొందారు. సీఐడీ, నంద్యాల టూటౌన్, ఆదోని టూటౌన్, కర్నూలు వన్‌టౌన్, స్పెషల్ బ్రాంచ్, కర్నూలు, తిరుపతి, కోడుమూరు సర్కిల్, డోన్ రూరల్ సర్కిల్, డీసీఆర్‌బీలలో సీఐగా పని చేస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు.