ఆలయ ఉద్యోగులపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-07-10T10:28:25+05:30 IST
మహానంది ఆలయంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే 6మంది రెగ్యులర్ ఉద్యోగులపై కేసు నమోదు ..

మహానంది జూలై 9: మహానంది ఆలయంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే 6మంది రెగ్యులర్ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి తెలిపారు. 2018లో అప్పటి ఈవో సుబ్రహ్మణ్యంతో పాటు మరో 5మంది ఉద్యోగులపై మహానంది ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు దేవస్థానం ఉద్యోగులు ఆలయంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై కమిటీ సభ్యులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఉత్త ర్వుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలి పారు. అయితే ఈవో సుబ్రహ్మణ్యం గత నెల 30న పదవి విరమణ పొంది, గురువారం ఆయన గుండెపోటుతో చిత్తూరులో మృతి చెందారు.